Rohit Sharma : అదేజరిగితే మేం ఇబ్బందుల్లో పడేవాళ్లం.. సెమీఫైనల్ లో విజయం తరువాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు.

Rohit Sharma : అదేజరిగితే మేం ఇబ్బందుల్లో పడేవాళ్లం.. సెమీఫైనల్ లో విజయం తరువాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit sharma

ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ జట్టుపై భారత్ అద్భుత విజయం సాధించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. బుధవారం ముంబయిలో జరిగిన మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాలో కోహ్లీ, శ్రేయాస్ లు సెంచరీలు చేశాడు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ జట్టు 397 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. 327 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గురువారం దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజేత జట్టుతో ఈనెల 19న భారత్ జట్టు ఫైనల్స్ లో తలపడనుంది.

Also Read : Anushka Sharma Viral Post : 50వ సెంచరీ సాధించిన భర్త కోహ్లీని అనుష్కా శర్మ ఏమని వ్యాఖ్యానించిందంటే… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. భారత్ జట్టు 30-40 పరుగులు తక్కువ చేసిఉంటే ఇబ్బందుల్లో పడేవాళ్లమని అన్నారు. విలియమ్సన్, మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో మేం మ్యాచ్ ను కోల్పోతామా అనే ఆందోళనసైతం వ్యక్తమైందని రోహిత్ అన్నారు. నేను ఈ మైదానంలో అనేకసార్లు మ్యాచ్ లు ఆడాను. ఈ మైదానంలో ఎంత పెద్ద స్కోర్ చేసినా ఏదోఒకమూల ఆందోళన వ్యక్తమవుతూనే ఉంటుంది. మాపై ఒత్తిడి ఉంటుందని మాకు తెలుసు. కానీ, ప్రశాంతంగా ఉండటం మాకు ముఖ్యం. మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవసరమైన సమయంలో వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టు ఓటమి అంచుల్లోకి నెట్టాడని రోహిత్ అభినందించాడు.

Also Read : IND vs NZ : వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లతో తొలి భారత బౌలర్‌గా మహ్మద్ షమీ..

యువ ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు. శ్రేయాస్ అయ్యర్, గిల్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమైంది. దురదృష్టవశాత్తూ గిల్ ఆట మధ్యలోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. కోహ్లీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుత ఫామ్ ను కొనసాగించాడని రోహిత్ అన్నాడు. సెమీఫైనల్ అయినందున ఒత్తిడి లేదని చెప్పను. ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఒత్తిడి అనేది ఉంటుంది.. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ లాంటి మ్యాచ్ లలో కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురవుతాం. మొదటి తొమ్మిది మ్యాచ్ లు ఏవిధంగా ఆడామో అదే విధంగా ఆడాలని మ్యాచ్ ప్రారంభానికి ముందే నిర్ణయించుకున్నాం.. అదే తరహాలో విజయం సాధించాం అని రోహిత్ శర్మ అన్నారు.

Also Read : Sachin Tendulkar : నా హృద‌యాన్ని ట‌చ్ చేశావ్ కోహ్లీ.. ఆ రోజు నాకు న‌వ్వు ఆగ‌లేదు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. టీమిండియాకు అభినందనలు. వారు అద్భుతంగా ఆడారు. 400 పరుగులు అనేది సహజంగానే కఠినమైనది. మేము ఓడిపోవటం నిరాశపర్చింది. కానీ, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే.. గత ఏడు వారాలుగా మాకు భారత్ లో మంచి ఆదరణ లభించింది. ఈ టోర్నీలో రచిన్, మిచెల్ అద్భుతంగా రాణించారు. సెమీఫైనల్స్ ఓడిపోయినప్పటికీ ఈ మెగా టోర్నీలో మా ఆటతీరుపట్ల సంతోషంగానే ఉన్నామని విలియమ్సన్ అన్నారు.