Sachin Tendulkar : నా హృద‌యాన్ని ట‌చ్ చేశావ్ కోహ్లీ.. ఆ రోజు నాకు న‌వ్వు ఆగ‌లేదు

Sachin Tendulkar comments : త‌న రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం పై స‌చిన్ స్పందించాడు. ఓ భార‌తీయుడు త‌న రికార్డును బ‌ద్ద‌లు కొట్టినంద‌కు చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు.

Sachin Tendulkar : నా హృద‌యాన్ని ట‌చ్ చేశావ్ కోహ్లీ.. ఆ రోజు నాకు న‌వ్వు ఆగ‌లేదు

Sachin Tendulkar comments

Updated On : November 15, 2023 / 7:12 PM IST

వ‌న్డేల్లో 50 సెంచ‌రీలు మొద‌టి ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. ముంబైలోని వాంఖ‌డే మైదానంలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ శ‌త‌కం చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ క్ర‌మంలో క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. వ‌న్డేల్లో స‌చిన్ 49 శ‌త‌కాలు చేయ‌గా తాజా శ‌త‌కంతో విరాట్ యాభై సెంచ‌రీలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా కోహ్లీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

కాగా.. త‌న రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం పై స‌చిన్ సైతం స్పందించాడు. ఓ భార‌తీయుడు త‌న రికార్డును బ‌ద్ద‌లు కొట్టినంద‌కు చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. ఇక కోహ్లీని తొలిసారి ఇండియ‌న్ డ్రెస్సింగ్ రూమ్‌లో క‌లిసిన‌ప్ప‌టికి ఘ‌ట‌న త‌న‌కు ఇంకా గుర్తుకు ఉంద‌న్నాడు. ‘ఆ రోజు మిగ‌తా ఆట‌గాళ్లు కోహ్లీని ప్రాంక్ చేశారు. నా పాదాల‌ను తాకి ఆశీర్వాదం తీసుకోవాల‌ని, ఇది ఒక ఆన‌వాయితీ అని వారు అత‌డితో చెప్పారు. ఆ స‌మ‌యంలో నాకు న‌వ్వు ఆగ‌లేదు. అయితే.. ఆ త‌రువాత నువ్వు ఇంత‌లోనే నీ అంకిత‌భావం, ఆట‌లోని నైపుణ్యాల‌తో నా హృద‌యాన్ని ట‌చ్ చేశావ్‌. ఆ యువ‌కుడు ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.’ అని స‌చిన్ అన్నాడు.

Virat Kohli : సెంచ‌రీ త‌రువాత విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైర‌ల్‌..

ఓ భార‌తీయుడు త‌న రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన‌ట్లు స‌చిన్ చెప్పారు. నా హోమ్ గ్రౌండ్‌లో అదీ కూడా ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డం ఎంతో ప్ర‌త్యేకం అని సోష‌ల్ మీడియాలో స‌చిన్ రాసుకొచ్చారు.

కాగా.. వ‌న్డేల్లో స‌చిన్ 49 శ‌త‌కాలు చేయ‌డానికి 452 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. విరాట్ కోహ్లీ కేవ‌లం 279 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు రికార్డు బ‌ద్ద‌లు..

2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ 673 ప‌రుగులు చేశాడు. తాజాగా ఈ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. 2023 ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ 711 ప‌రుగులు చేసి స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. దీంతో పాటు ఓ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సార్లు 50 ఫ్ల‌స్ స్కోరు చేసిన ఆట‌గాడిగానూ కోహ్లీ నిలిచాడు. ఈ టోర్నీలో విరాట్ 8 సార్లు ఈ ఘ‌న‌త సాధించాడు.

World Cup 2023 Prize Money : మీకు ఇది తెలుసా..? ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు, గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ప్రైజ్‌మ‌నీ ఎంత ఇస్తారో..?