World Cup 2023 Prize Money : మీకు ఇది తెలుసా..? ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు, గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ప్రైజ్‌మ‌నీ ఎంత ఇస్తారో..?

World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 చివ‌రి అంకానికి వ‌చ్చేసింది. లీగ్ ద‌శ‌లోని మ్యాచ్‌లు అన్ని పూర్తి అయ్యాయి.

World Cup 2023 Prize Money : మీకు ఇది తెలుసా..?  ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు, గ్రూప్ స్టేజీలో నిష్ర్క‌మించిన జ‌ట్ల‌కు ప్రైజ్‌మ‌నీ ఎంత ఇస్తారో..?

World Cup 2023 Prize Money

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 చివ‌రి అంకానికి వ‌చ్చేసింది. లీగ్ ద‌శ‌లోని మ్యాచ్‌లు అన్ని పూర్తి అయ్యాయి. నాకౌట్ మ్యాచులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. భార‌త్‌, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. బుధ‌, గురువారాల్లో సెమీ ఫైన‌ల్ మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 19న‌) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చాలా మంది దృష్టి ఓ దానిపై ప‌డింది. ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిస్తే ఎంత ప్రైజ్‌మ‌నీ ల‌భిస్తుంది. సెమీస్‌లో ఓడిపోయిన జ‌ట్ల‌కు ఎంత వ‌స్తుంది..? అన్న విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

2023 ప్రపంచకప్‌ ప్రైజ్‌ మనీని ఐసీసీ పది మిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా నిర్ణ‌యించింది. మ‌న భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.74.15 కోట్లు అన్న మాట‌. ఈ మొత్తం నుంచే వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత‌తో పాటు రన్నరప్‌, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు, లీగ్‌ దశలో ఆడిన జట్లకూ పంపిణీ చేయ‌నున్నారు.

ఎవ‌రికి ఎంతంటే..?

ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు 4 ల‌క్ష‌ల యూఎస్ డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.33.29 కోట్లు అంద‌నుంది. ఇక ర‌న్న‌ర‌ప్‌కు 2ల‌క్ష‌ల యూఎస్ డాల‌ర్లు అంటే సుమారు రూ.16.64 కోట్లు దక్కనుంది. సెమీ ఫైనల్‌లో ఓడిన జ‌ట్ల‌కు రూ.6.6 కోట్లు, గ్రూప్ స్టేజీలోనే నిష్ర‌మించిన ఆరు జ‌ట్ల‌కు ఒక్కొ జ‌ట్టుకు ల‌క్ష డాల‌ర్లు అంటే రూ.83ల‌క్ష‌లు ఇవ్వ‌నున్నారు. ఇక గ్రూపు ద‌శ‌లో ప్ర‌తీ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుకు రూ.33 ల‌క్ష‌లు అందుతాయ‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Kane Williamson : సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ముందు కేన్ మామ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అండర్‌డాగ్స్ ట్యాగ్ గురించి చింతలేదు

10 జ‌ట్లు పాల్గొన‌గా..

wc points table 2023

wc points table 2023

Kapil Dev : టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌పై క‌పిల్ దేవ్ కామెంట్స్‌.. సాయం కోసం రారు.. వారికి మా అవ‌స‌రం లేదు

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి. ఇందులో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు గ్రూప్ స్టేజీలోనే ఇంటి ముఖం ప‌ట్టాయి. అంటే ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌కు త‌లా రూ.83లక్ష‌లు ద‌క్క‌నున్నాయి. ఇవి కాకుండా లీగ్ స్టేజీలో ఆయా జ‌ట్లు ఎన్ని విజ‌యాలు సాధించాయో ప్ర‌తీ గెలుపుకు రూ.33 లక్ష‌లు అద‌నంగా వ‌స్తాయి.