Sana Khan : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. తెలుగులో ఏ స్టార్ హీరో సినిమాలో నటించిందో తెలుసా..?

2020 లో ఎంటర్టైన్‌మెంట్ రంగానికి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసికొన్న సనా ఖాన్.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనించింది.

Bollywood heroine Sana Khan gave birth to baby boy

Sana Khan : ముంబై భామ సనా ఖాన్‌ బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసింది. సినిమాలతో పాటు టీవీ షోలు వెబ్ సిరీస్ లో కూడా కనిపించి ఆడియన్స్ ని అలరించింది. ఇక 2020 లో ఎంటర్టైన్‌మెంట్ రంగానికి గుడ్ బై చెప్పేసిన ఆ భామ.. అదే ఏడాది నవంబర్ లో సూరత్ కి చెందిన ‘అనాస్ సయెద్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని దుబాయ్ లో ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ పండంటి మగబిడ్డకు జన్మనించింది.

Bholaa Shankar : భోళా శంకర్ అప్డేట్ ఇస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిరు..

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “మా పై మీరందరు చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇక పై మా బిడ్డకు కూడా మీ దీవెనలు కావాలి” అంటూ పోస్ట్ వేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకీ సనా ఖాన్‌ తెలుగులో ఏ ఏ స్టార్ హీరో సినిమాలో నటించి ఉంటుందని ఆలోచిస్తున్నారా..? 2010 లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి పరిచయం అయ్యింది సనా ఖాన్.

Samajavaragamana : ‘సామజవరగమన’తో కెరీర్ హైయెస్ట్ అందుకున్న శ్రీవిష్ణు.. 7 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఆ తరువాత నాగార్జున ‘గగనం’, మంచు మనోజ్ ‘మిస్టర్‌ నూకయ్య’ సినిమాల్లో ముఖ్య పాత్రలో కనిపించింది. సినిమా పరిశ్రమలో ఉండగానే సనా ఖాన్ ప్రముఖ కొరియోగ్రాఫేర్ ‘మెల్విన్ లూయిస్’ తో ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే 2020 లో వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. ఆ తరువాతే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. మూవీస్ లో కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు