ఎన్నికలవేళ సినిమా రంగం వాళ్లు నేతల బయోపిక్‌ల హడావుడి పెంచేశారు. బాలీవుడ్‌లో ప్రధాని మోడీ మీద అయితే బయోపిక్‌లు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ఎన్నికలవేళ సినిమా రంగం వాళ్లు నేతల బయోపిక్‌ల హడావుడి పెంచేశారు. బాలీవుడ్‌లో ప్రధాని మోడీ మీద అయితే బయోపిక్‌లు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో మోడీతో బాలీవుడ్ ప్రముఖులు సమావేశమై జాతి నిర్మాణంలో సినిమాల పాత్రపై చర్చలు జరిపడంతో బాలీవుడ్–మోడీ బంధం బలపడింది. ఈ క్రమంలో ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్స్’ అనే సినిమాలో మోడీని హైలెట్ చేస్తూ చూపించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో మంచి హిట్ అయింది. రంజిత్ కపూర్ ఇందులో మోడీ పాత్రలో నటించారు. ఇప్పుడు మోడీపైన తీస్తున్న పీఎం నరేంద్ర మోడీ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవగా.. ప్రముఖ నిర్మాతలు వెబ్‌సిరీస్‌లను కూడా తెరకెక్కిస్తున్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
పీఎం నరేంద్ర మోడీ:
కమర్షియల్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ యాక్షన్ సినిమాలా తెరకెక్కించిన మోడీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోడీ’. వివేక్ ఒబెరాయ్ హీరోగా నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ అయ్యి ప్రధానిగా ఎలా ఎదిగాడు అనే క్రమాన్ని కథగా మలిచి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా మోడీ ఉద్యమంలో పాల్గొనడం హైలెట్ చేయగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లు, అక్షర్ ధామ్ ఆలయంపై ఉగ్రవాదుల దాడులు వంటివి హైలెట్ చేశారు. ఈ సినిమాను సందీప్ సింగ్ నిర్మిస్తుండగా ఏప్రిల్ 5వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను దేశంలోని అన్నీ బాషలలోను విడుదల చేయనున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న వేళ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో సినిమా విడుదల అవుతుందా? అనేది అనుమానమే.
మోదీ– ఏ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్:
‘నియంతలకు మతాలు లేవు. కనీసం మృతులనైనా హిందూ, ముస్లింలని వేరుచేయకండి’ . ‘మోడీ– ఏ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్’ ట్రైలర్‌లో 2002 నాటి గోద్రా అల్లర్లను ప్రస్తావిస్తూ మంటల్లో రైలు బోగి దగ్ధమవుతుంటే మోడీ పాత్రధారి ఆశిష్ శర్మ చెప్పిన డైలాగులు ఇవి. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో ఈరోస్ నౌలో విడుదలయ్యే అవకాశం ఉంది. బాల్యంలో టీ అమ్మే వ్యక్తిగా పనిచేయడం, ఇందిరా గాంధీని వ్యతిరేకించడం, పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం లాంటి మోడీ గుణాలను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించనున్నారు.
మోదీ కాకా కా గావ్:
మోడీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, సర్జికల్ దాడులు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను ప్రస్తావిస్తూ తీసిన సినిమా ఇది. 2017, డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ సినిమా రిలీజ్ కావాలి అయితే ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదే ఏడాది డిసెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నమో సౌనె గామ:
గుజరాతీలో తీసిన ఈ సినిమా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైంది. గుజరాత్, ముంబైలలో ఒకరోజు ఆడిన తరువాత ఎన్నికల సంఘం చిత్ర ప్రదర్శనను నిలిపేసింది. నరేంద్ర మోదీకి సంబంధించి ఈ చిత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదని నిర్మాతలు వాదించినా సినిమా పేరు, హీరో పాత్ర తదితరాలు అసలు విషయమేంటో స్పష్టం చేశాయి. ఈ మార్చిలో సినిమాను తిరిగి విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు.
ఏది ఏమైనప్పటికీ బాలీవుడ్ మోడీ జపం చేస్తూ.. సినిమాలు తీస్తుండగా.. మోడీకి ప్రచారం.. సినిమా వాళ్లకు డబ్బులు.. రెండూ కలిసి వస్తున్నాయి.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం