Laapataa Ladies : 2025 ఆస్కార్ బరిలో.. ఇండియా నుంచి అధికారికంగా వెళ్లిన సినిమా ఇదే..

మన దేశం నుంచి అధికారికంగా 'లాపతా లేడీస్‌' అనే సినిమాని ఆస్కార్ కి పంపిస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Laapataa Ladies

Laapataa Ladies : RRR సినిమా తర్వాత ఇండియన్స్ కు కూడా ఆస్కార్ అవార్డులపై ఆసక్తి నెలకొనడమే కాక అవార్డులు సాధించొచ్చు అనే నమ్మకం మరింత కలిగింది. దీంతో ఆస్కార్ అవార్డులపై ఇండియన్స్ మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 2025 ఆస్కార్ వేడుకలకు ఎంట్రీలు తీసుకుంటున్నారు. మన దేశం నుంచి అధికారికంగా ‘లాపతా లేడీస్‌’ అనే సినిమాని ఆస్కార్ కి పంపిస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Also Read : Mahesh Babu : సీఎంతో మహేష్ బాబు భేటీ.. బాబు లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..

ఆమిర్ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ.. పలువురు ముఖ్యపాత్రల్లో లాపతా లేడీస్‌ సినిమా తెరకెక్కింది. 2000 సంవత్సరంలో రెండు కొత్త పెళ్లి జంటల్లో అనుకోకుండా పెళ్లి కూతురులు మారిపోతే వాళ్ళు వారి నిజమైన భర్తల దగ్గరకు ఎలా చేరుకున్నారు అని ఆసక్తికరంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు లాపతా లేడీస్‌ సినిమాని ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ బరికి పంపించడంపై మూవీ యూనిట్ తో పాటు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకురాలు కిరణ్‌రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2025లో ఆస్కార్‌ కి భారత్‌ తరఫున లాపతా లేడీస్‌ వెళ్తుందని అనుకుంటున్నాను అని తెలిపింది. అనుకున్నట్టే లాపతా లేడీస్‌ ఆస్కార్ బరిలో నిలిచింది. మరి ఈ సినిమా ఆస్కార్ అవార్డు నెగ్గుతుందా చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాని చూడాలంటే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.