The Archies: ఒకే ఫ్రేమ్‌లో బాలీవుడ్ స్టార్ కిడ్స్.. జోయా అక్తర్ పోస్టర్!

అమితాబ్ లాంటి మెగాస్టార్స్ వయసు మీద పడడంతో అందుకు తగ్గ పాత్రలకే పరిమితమైపోయారు. ఆ తర్వాత ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్ లాంటి వాళ్ళు మధ్య వయసుకి చేరినా ఇంకా ఏదో తపన పడుతూ.. పడుతూ లేస్తూ రాణించాలని చూస్తున్నారు.

The Archies

The Archies: అమితాబ్ లాంటి మెగాస్టార్స్ వయసు మీద పడడంతో అందుకు తగ్గ పాత్రలకే పరిమితమైపోయారు. ఆ తర్వాత ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్ లాంటి వాళ్ళు మధ్య వయసుకి చేరినా ఇంకా ఏదో తపన పడుతూ.. పడుతూ లేస్తూ రాణించాలని చూస్తున్నారు. ఇక యంగ్ హీరోలు సీనియర్ హీరోల స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి తోడు బాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ కూడా రెడీ అయింది. ఇందులో వారసులతో పాటు వారసురాలు కూడా పోటీ పడుతూ వెండితెరను ఏలేయాలనే ఆరాటపడుతున్నారు.

Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!

బాలీవుడ్ లో ఇప్పటికే వారసురాళ్ల ఎంట్రీ ఇవ్వడంతో పాటు దిగ్విజయంగా స్టార్ డమ్ కూడా దక్కించుకుంటూ స్టార్స్ వారసులకు పోటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ జెనరేషన్ కూడా దిగిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు అరడజను మంది వారసులు, వారసురాళ్లు ఒకేసారి వెండితెర ఎంట్రీ సిద్ధమవుతున్నారు. ముందుగా వెబ్ సినిమాతో వీరి అరంగేట్రానికి పనులు కూడా మొదలయ్యాయి. జోయా అక్తర్‌ ఈ వెబ్ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఫస్ట్ పోస్టర్ రిలీజై తెగ హల్చల్ చేస్తుంది.

Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!

ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ మనవడు, కూతురు కుమారుడు అగస్త్యా నంద, బోనీ కపూర్‌-శ్రీదేవిల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌, షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ సహా మిహిర్‌ అహుజా, డాట్, యువరాజ్‌ మెండా మొత్తం ఏడుగురు యువ నటులు ఈ వెబ్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ వారసుల ఈ తొలి వెబ్‌ ఫిల్మ్‌ ‘ద ఆర్చీస్‌’ పోస్టర్‌ విడుదలైంది. జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ మూవీ 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ‘ద ఆర్చీస్‌’ గ్యాంగ్‌ ఇదే అని ప్రకటించి రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.