Site icon 10TV Telugu

Koi Mil Gaya : బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్‌ల సందడి.. హృతిక్ రోషన్ సూపర్ హిట్ సినిమా 20 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ ..

Bollywood super hit movie Hrithik Roshan Koi Mil Gaya Re Releasing after 20 Years

Bollywood super hit movie Hrithik Roshan Koi Mil Gaya Re Releasing after 20 Years

Koi Mil Gaya Movie : ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలని అభిమానుల కోసం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్(Tollywood) లో ఈ హవా నడుస్తుంది. ప్రతి నెల ఏదో ఒక్క సినిమా అయినా రీ రిలీజ్ ఉంటుంది. స్టార్ హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ హిట్స్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ లు చేస్తున్నారు. వాటికి 4K వర్షన్ లో మార్చి మరింత క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లకు స్పందన బాగుండి కలెక్షన్స్ కూడా వస్తుండటంతో రీ రిలీజ్ ల హవా మరింత పెరిగింది.

టాలీవుడ్ లో మొదలైన ఈ రీ రిలీజ్ ల సందడి ఆ తర్వాత తమిళ్ కి కూడా చేరింది. అక్కడ కూడా ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలని రీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్(Bollywood) కూడా రీ రిలీజ్ లు మొదలుపెట్టింది. తాజాగా 20 ఏళ్ళ క్రితం సూపర్ హిట్ అయిన హృతిక్ రోషన్(Hruthik Roshan) ‘కోయి మిల్ గయా’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.

Ustaad Bhagat Singh : బ్రో అయ్యిపోయింది.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్.. సంక్రాంతి రిలీజ్‌కి..!

రాకేష్ రోషన్(Rakesh Roshan) దర్శకత్వంలో హృతిక్ రోషన్, ప్రీతీ జింతా(Preeti Zinta) జంటగా తెరకెక్కిన కోయి మిల్ గయా సినిమా 20 ఏళ్ళ క్రితం 2003 ఆగస్టు 8న రిలీజయింది. ఈ సినిమాలో హీరోయిన్ హన్సిక(Hansika) చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అప్పట్లోనే ఈ సినిమాకు 35 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే 80 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కోయి మిల్ గయా సినిమాని ఆగస్టు 4న గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు. 10వ తేదీ వరకు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో ఆడనుంది. దీంతో ఈ సినిమా అభిమానులు, హృతిక్ అభిమానులు మరోసారి థియేటర్స్ లో ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. కోయి మిల్ గయా సినిమాకి కొనసాగింపుగానే ఆ తర్వాత క్రిష్ సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.

Exit mobile version