Bolywood actress Raveena Tandon gets Padma shri Award from Government of India
Raveena Tandon : KGF 2లో ప్రధానమంత్రి రమికా సేన్ క్యారెక్టర్ లో నటించి అందర్నీ మెప్పించి ఒక్కసారిగా అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది రవీనా టాండన్. బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినా KGF 2 సినిమాతో సౌత్ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలు కూడా ఆమె నటనని మరోసారి మెచ్చుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే KGF 2 సినిమా తనకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది.
బాలీవుడ్ లో పత్తర్ కె పూల్ అనే సినిమాతో 1991 లో ఎంట్రీ ఇచ్చిన రవీనా టాండన్ ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2006 తర్వాత నాలుగేళ్లు సినిమాలకి దూరంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్ గా కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్పెషల్ క్యారెక్టర్స్ తో కూడా బిజీగా మారింది. KGF 2 సినిమా రవీనా టాండన్ కి మరింత పేరు తెచ్చింది. రవీనా గతంలోనే తెలుగులో రథ సారధి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధుల్లో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్లో నటించింది. తమిళ్, కన్నడలో కూడా కొన్ని సినిమాలు చేసింది.
Vani Jairam : అయిదు దశాబ్దాల సంగీత ప్రయాణం.. ‘శంకరాభరణం’ వాణీ జయరాంకు పద్మభూషణ్..
ప్రస్తుతం కొన్ని సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది రవీనా టాండన్. తాజాగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించగా మహారాష్ట్ర నుంచి కళల విభాగంలో సినిమాకు చేసిన సేవలకు గాను రవీనా టాండన్ కి పద్మశ్రీ ప్రకటించారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులతో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రవీనా టాండన్ ఇప్పటికే 85 కి పైగా సినిమాలు చేసింది. త్వరలో 100 సినిమాలు టార్గెట్ గా దూసుకువెళ్తుంది. దీనిపై రవీనా టాండన్ స్పందించి భారత ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నాకు చాలా గౌరవంగా ఉంది అని తెలిపింది.