సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్.. బొంబాట్ హిట్!

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలపై ఇటీవలికాలంలో ప్రజలు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే సైన్స్ ఫిక్షన్ సినిమాకి ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోడించి వచ్చిన సినిమా ‘బొంబాట్’. విమర్శకులు మెచ్చేలా తీసిన బొంబాట్ సినిమాకి సూపర్ హిట్ టాక్ రాగా.. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.



కె రాఘవేంద్రరావు సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకంపై సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి నటీనటులుగా రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మించిన రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం “బొంబాట్” డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సూపర్ హిట్ రివ్యూస్‌తో అద్భుతమైన కామెంట్స్‌తో నెటిజన్లు సినిమాను ప్రశంసిస్తున్నారు.



ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ.. “తెలుగులో విడుదలైన సరికొత్త సినిమా బొంబాట్. రోబోటిక్ కాన్సెప్ట్‌తో అందమైన ప్రేమ కథా చిత్రంగా కుటుంబ విలువలను మేలవించి, కనువిందు చేసే గ్రాఫిక్స్‌తో అందమైన పాటలతో మంచి కామెడీతో అంతా కలిసి చూసేలా వచ్చింది బొంబాట్ చిత్రం. చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. మా సినిమాని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు” అని తెలిపారు.



నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ మాట్లాడుతూ.. “ముందుగా మా బొంబాట్‌ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు. రోబోటిక్ అంశంతో సరికొత్త కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గరనుంచి ప్రతి తెలుగు ప్రేక్షకుడు సినిమా అద్భుతంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. ఇండియా నుంచి అమెరికా వరకు లండన్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రతి ఒక్కరు సినిమా ని చూస్తున్నారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు. జోష్ బి గారు అందించిన సంగీతం మరియు గ్రాఫిక్స్ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. చుసిన వారికీ ధన్యవాదాలు మరియు చుడనివారు ఉంటె తప్పకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ” అని అన్నారు.



నటి నటులు : సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి, మకరంద్ దేశ్ పాండే, ప్రియదర్శిని, తనికెళ్ళ భరణి, శిషీర్ శర్మ, వినీత్ కుమార్, హేమ, తదితరులు
చిత్రం పేరు : బొంబాట్
సంగీతం : బి జోష్
రైటర్ : అక్షయ్ పుల్లా
డైరెక్టర్ : రాఘవేంద్ర వర్మ
నిర్మాత : విశ్వాస్ హన్నూర్ కార్