Sridevi Mom Movie : శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్ అనౌన్స్.. హీరోయిన్ గా శ్రీదేవి కూతురే.. తిడుతున్న నెటిజన్లు..

శ్రీదేవి చివరగా నటించిన మామ్ సినిమా 2017లో రిలీజయి మంచి విజయమే సాధించింది.

Boney kapoor Announce Sridevi Last Movie MOM Sequel with Kushi Kapoor Fans Trolling on them

Sridevi Mom Movie : సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తాయని తెలిసిందే. అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీది నటించిన చివరి సినిమా మామ్ కు తాజాగా సీక్వెల్ ప్రకటించారు. శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఐఫా అవార్డుల వేడుకల్లో శ్రీదేవి నటించిన చివరి సినిమా మామ్ కు సీక్వెల్ ప్రకటించి, అందులో తన చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా చేస్తుందని ప్రకటించాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

శ్రీదేవి చివరగా నటించిన మామ్ సినిమా 2017లో రిలీజయి మంచి విజయమే సాధించింది. రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా.. పలువురు కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి 2018లో మరణించాక మామ్ సినిమాలో శ్రీదేవి నటనకు ఉత్తమ నటి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

Also See : Anasuya Bharadwaj : ఇంత సీరియస్ లుక్స్ ఎందుకమ్మా.. చీరలో సీరియస్ గా చూస్తూ అనసూయ భరద్వాజ్ పోజులు..

శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు ప్రస్తుతం హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ ఏదో తన అందంతో నెట్టుకొస్తూ పర్వాలేదనిపిస్తుంది. ఖుషి ఇప్పటికే మూడు సినిమాలు చేయగా మూడు ఫ్లాప్ అయ్యాయి. ఖుషి నటనపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు శ్రీదేవి లాంటి లెజెండ్ చేసిన సినిమా సీక్వెల్ లో ఖుషి కపూర్ నటిస్తుంది అని ప్రకటించడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు, సినిమా లవర్స్ సోషల్ మీడియాలో బోని కపూర్ ని, ఖుషి కపూర్ ని విమర్శిస్తున్నారు.

కావాలంటే జాన్వితో చెయ్యండి, ఖుషితో మామ్ సీక్వెల్ వద్దు. లేదా మామ్ సీక్వెల్ ఆపేయండి, లేక వేరే హీరోయిన్స్ ని తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి బోనికపూర్ మామ్ సీక్వెల్ నిజంగానే ఖుషి కపూర్ తో తీస్తారా లేదా చూడాలి.