BoyapatiRAPO : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ వైరల్ అయింది. రామ్ లుక్ మార్చేసి మరింత మాస్ గా తయారయ్యాడు ఈ సినిమా కోసం.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరిగినట్టు చిత్రయూనిట్ కూడా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. గతంలో ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అక్టోబర్ 20 అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో దసరా బరి నుంచి తప్పుకున్నారు. అయితే సినిమా వాయిదా వేయకుండా మరింత ముందుకు తీసుకొచ్చారు.
Adipurush : ఆదిపురుష్ చూడటానికి.. జపాన్ నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రభాస్ మహిళా అభిమాని..
బోయపాటి రామ్ సినిమాను 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా చిత్రయూనిట్ ప్రకటించారు. దీంతో పాటు పొలాల్లో మంచం వేసుకొని రామ సరదాగా కూర్చున్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇక డ్యాన్స్ లో ఫుల్ ఎనర్జీ ఉన్న శ్రీలీల, రామ్ కలిసి ఏ రేంజ్ లో స్టెప్పులేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు.
Massive Energy Striking Early in Theatres⚡️💥#BoyapatiRAPO Worldwide Release on SEP 15th in Telugu,Tamil, Kannada, Malayalam & Hindi🔥#BoyapatiRAPOonSep15❤️🔥
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @StunShiva8 @SS_Screens… pic.twitter.com/2lpwejNekU
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 23, 2023