Adipurush : ఆదిపురుష్ చూడటానికి.. జపాన్ నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రభాస్ మహిళా అభిమాని..

ఆదిపురుష్ సినిమా ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రిలీజ్ అయింది. అయితే జపాన్ లో ఇంకా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వలేదు. జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Adipurush : ఆదిపురుష్ చూడటానికి.. జపాన్ నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రభాస్ మహిళా అభిమాని..

Prabhas female fan from Japan travelling to Singapore for watching adipurush

Prabhas Fans : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజయిన దగ్గర్నుంచి వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా ఆదిపురుష్ సినిమాపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం అవేమి లెక్క చేయకుండా సినిమా చూడటానికి వస్తున్నారు. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఆదిపురుష్ సినిమాకి. ఆదిపురుష్ సినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

ఆదిపురుష్ సినిమా ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రిలీజ్ అయింది. అయితే జపాన్ లో ఇంకా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వలేదు. జపాన్ లో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు జపాన్ లో భారీ విజయం సాధించాయి. జపాన్ లో ప్రభాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ మహిళా అభిమాని ప్రభాస్ ఆదిపురుష్ సినిమా జపాన్ లో ఇంకా రిలీజవ్వలేదని సినిమా చూడటానికి సింగపూర్ వరకు వచ్చింది.

Suman : నటుడు సుమన్‌పై డైరెక్టర్ శివనాగు ఫైర్.. ఈవెంట్‌కి రమ్మంటే 2 లక్షలు అడిగాడు..

నోరికో అనే ఓ మహిళా అభిమాని ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చూడటానికి జపాన్ నుంచి సింగపూర్ వరకు వచ్చి అక్కడ ఆదిపురుష్ సినిమా చూసింది. ఇది తెలుసుకున్న అక్కడి ఇండియన్స్ ఆమెతో మాట్లాడించి ఓ వీడియోని తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్ అభిమాని.. నా పేరు నోరికో, జపాన్ నుంచి వచ్చాను. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ అభిమాని అని చెప్పింది. చివర్లో ప్రభాస్ రాముడిగా ఉన్న ఓ జెండాను చూపించింది. దీంతో ఈ వీడియో, ఆ అమ్మాయి వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఈ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు.