Suman : నటుడు సుమన్‌పై డైరెక్టర్ శివనాగు ఫైర్.. ఈవెంట్‌కి రమ్మంటే 2 లక్షలు అడిగాడు..
తాజాగా నటరత్నాలు ఆడియో లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేసారు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ శివనాగు మాట్లాడుతూ సుమన్ పై ఫైర్ అయ్యారు.

Director Siva Nagu fires on actor suman in natarathnalu audio launch event
Director Siva Nagu : హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్నారు డైరెక్టర్ శివనాగు. నటుడు సుమన్ తో గతంలో మూడు సినిమాలు చేశారు శివ నాగు. తాజాగా ఆయన సుమన్ పై ఫైర్ అయ్యారు. శివనాగు దర్శకత్వంలో నటరత్నాలు అనే సినిమా రాబోతుంది. బిగ్ బాస్ భామ ఇనయా సుల్తానా, రంగస్థలం మహేష్, సుదర్శన్.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఇండస్ట్రీలోని కష్టాలపై ఈ సినిమాని తెరకెక్కించినట్టు సమాచారం.
తాజాగా నటరత్నాలు ఆడియో లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేసారు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ శివనాగు మాట్లాడుతూ సుమన్ పై ఫైర్ అయ్యారు.
Jabardasth Santhi Kumar : డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్.. సాయికుమార్‌తో ఎమోషనల్ సినిమా..
శివ నాగు మాట్లాడుతూ.. నేను పిలిస్తే పలువురు పెద్దవాళ్ళు కూడా ఈవెంట్ కి వస్తారు. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు ఒకప్పుడు నాతో కలిసి ఉన్నవారే. నేను సినీ పరిశ్రమలో పడ్డ కష్టాలని ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేశాను. నేను ఒక హీరోతో మూడు సినిమాలు చేశాను. అతనితో నాకు మంచి బంధమే ఉంది. అతన్ని ఈ ఈవెంట్ కి గెస్ట్ గా పిలవమని పలువురు చెప్తే సరే అని అతనికి కాల్ చేశాను. పది రోజుల నుండి సరిగ్గా సమాధానం చెప్పకుండా కాల్స్ చేయించుకొని చివరికి రెండు లక్షలు ఇస్తే వస్తా అన్నాడు. ఆ హీరో ఎవరో కాదు సుమన్. నా ఈవెంట్ కి నీకు డబ్బులిచ్చి నిన్నే పిలిచి నీకు సన్మానం చేయాలా, నీకు నేను డబ్బులిచ్చి మళ్ళీ నీ గురించి మంచిగా మాట్లాడాలా, నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని నువ్వు చెప్తావా అని ఫైర్ అయ్యారు. దీంతో శివనాగు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మరి దీనిపై సుమన్ స్పందిస్తాడేమో చూడాలి.