Malavika Mohanan: బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలంటే కండిషన్ పెట్టిన మాళవికా!

హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహన్.. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్. తెలుగులో ఇంకా అరంగేట్రం చేయలేదు కానీ.. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ..

Malavika Mohanan: హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహన్.. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్. తెలుగులో ఇంకా అరంగేట్రం చేయలేదు కానీ.. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ ఈ చిన్నది పరిచయమే. సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలలో నటించిన మాళవికా.. మాస్టర్ సినిమాలో అదిరిపోయే నటనతో గుర్తింపు తెచ్చుకుంది.

Vijay Devarakonda: రౌడీ హీరో ఆశలన్నీ లైగర్‌పైనే.. గేమ్ ఛేంజర్ అవుతుందా?

ఒకపక్క సినిమాలతో పాటు మరోవైపు హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. ఎప్పటికప్పుడు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం మాళవికా నటించిన ధనుష్ మారన్ విడుదలకి సిద్ధంగా ఉండగా.. హిందీలో మరో సినిమా చేస్తుంది. తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్టిన ఈ మలయాళ బేబీ విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల సినిమాలో అవకాశం దక్కే ఛాన్స్ ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.

RGV: నా చిన్నప్పుడు పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకునేవాడిని.. వర్మ ట్వీట్!

కాగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో తన మాల్దీవుల టూర్ గురించి.. తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పుకొచ్చింది. ఇందులో మాళశిక మేల్‌ షర్ట్‌, షేవింగ్‌ కిట్‌ను వాలైంటైన్‌ డే గిఫ్ట్‌కు సిద్ధం చేస్తూ కనిపించగా.. అంతలో ఓ బాక్స్ కనిపించింది. అదేంటని అడగ్గా ఓ కంపెనీ వాలంటైన్స్‌ డే సందర్భంగా మేల్‌ షేవింగ్‌ కిట్‌ పంపింది. దీనికి బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఆమె అవును ఉన్నాడు అని సమాధానం ఇచ్చింది.

Telugu Films Release: ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలివే!

అయితే.. అతనేవరో చెప్పాలని పట్టుబట్టడంతో.. ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఖచ్చితంగా చెప్తాను. ప్రామిస్‌. కానీ ఈ వీడియోకు 1 మిలియన్‌ వ్యూస్‌ వస్తనే’ అంటూ కండిషన్‌ పెట్టింది. దీంతో ఇప్పుడు అమ్మడి ఫాలోవర్స్‌ ఆ వీడియోను షేర్ చేస్తూ ఎలాగైనా ఆ వీడియోకి మిలియన్ వ్యూస్ రాబట్టాలని ట్రై చేస్తున్నారు. మరి మళవిక బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలియాలంటే ఈ వీడియోకు మిలియన్‌ వ్యూస్‌ రావాలి.. మరి వస్తాయో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు