Brahamanandam Shares his Inter caste Marriage Issue in his Auto biography Book Nenu
Brahmanandam Marraige : ఎన్నో వందల సినిమాలతో మనల్ని నవ్వించి, ఇంకా నవ్విస్తున్న బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులు జీవితాంతం నవ్వుకునేంత నవ్వులని పండించారు ఆయన. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన చిత్రలేఖనం కళని కూడా బయటకి తీసి రకరకాల బొమ్మలు గీస్తున్నారు. ఇటీవల ఆయన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకొచ్చారు బ్రహ్మానందం.
‘నేను- మీ బ్రహ్మానందం’ అనే పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీని ఆయనే స్వయంగా రాసారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని చిరంజీవి విడుదల చేశారు. బ్రహ్మానందం గతంలో తెలుగు లెక్చరర్ కావడంతో ఆ స్వచ్ఛమైన తెలుగుని ఈ పుస్తకంలో ఉపయోగించారు. ఈ పుస్తకంలో చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, పేదరికం, వేరే వాళ్ళ సాయంతో తన చదువులు, సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు, తన ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్నో ఆసక్తికర, ఎవ్వరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో పంచుకున్నారు బ్రహ్మానందం.
ఈ పుస్తకంలోని తన పెళ్లి గురించి, అది ఎలా జరిగింది అని కూడా తెలిపారు. బ్రహ్మానందం ఎన్నో కష్టనష్టాలను దాటుకొని చదివి కాలేజీ లెక్చరర్ గా జాబ్ సంపాదించారు. అత్తిలిలో లెక్చరర్ గా చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. చిన్నప్పట్నుంచి పేద కుటుంబం అవ్వడం, బ్రహ్మానందం కష్టపడి చదువుకొని లెక్చరర్ జాబ్ తెచ్చుకోవడంతో కట్నం కోసం కూడా చూసారు తల్లితండ్రులు. అయితే చదువుకి డబ్బుల విషయంలో బ్రహ్మానందంకి హెల్ప్ చేసిన అనసూయమ్మ అనే ఆవిడ బ్రహ్మానందం కోసం ఓ సంబంధం తెచ్చింది. ఆమె భర్త చెల్లిళ్లలో ఒకరైన లక్ష్మిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బ్రహ్మానందంకి సలహా ఇచ్చారు ఆవిడ. బ్రహ్మానందంకి, లక్ష్మికి ముందే ముఖ పరిచయం ఉంది. అనసూయమ్మ గారు బ్రహ్మానందంకి చాలా సహాయం చేయడం, లక్ష్మి మంచి అమ్మాయి అని తెలుసు కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు బ్రహ్మానందం.
Also Read : Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ మళ్ళీ వాయిదానా? సమ్మర్ కి లేనట్టేనా?
కానీ ఇంట్లో చెప్తే వేరే క్యాస్ట్ అని ఒప్పుకోకుండా పెద్ద గొడవ చేశారు. బ్రహ్మానందం వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అయితే, లక్ష్మి వాళ్ళు కాపులు. అందులోను కట్నం లేకుండా పెళ్లి. దీంతో బ్రహ్మానందం ఇంట్లో ససేమీరా ఒప్పుకోలేదు. చాలా ట్రై చేసాడు బ్రహ్మానందం అయినా ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుంటే లక్ష్మిని చేసుకుంటాను లేకపోతే జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. బ్రహ్మానందంకి ఇష్టమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి 1977 డిసెంబర్ 14న జరిగింది. అప్పుడున్న జీతంతో ఇద్దరూ బతకడం కష్టం అయినా లక్ష్మి సహకారం వల్లే ఆయన ఇంత సాధించానని, ఆమె ఇంటిని చక్కదిద్దింది అని చెప్పారు బ్రహ్మానందం. దీంతో బ్రహ్మానందం రాసిన పుస్తకంలోని అనేక విశేషాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.