Brahmanandam : కర్ణాటక ఎలక్షన్స్ లో బ్రహ్మానందం ప్రచారం.. ఎవరికోసం.. ఏ పార్టీ కోసం?

ఇప్పటికే పలువురు కన్నడ నటులు కర్ణాటక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరింతమంది సినిమావాళ్లని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్, హాస్య చక్రవర్తి బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు.

Brahmanandam campaign in Karnataka Elections for supporting BJP

Brahmanandam :  కర్ణాటకలో (Karnataka) ప్రస్తుతం రసవత్తర రాజకీయం సాగుతోంది. మే 10న కర్ణాటక ఎలక్షన్స్ (Elections) పోలింగ్ ఉండటంతో, పోలింగ్ కి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరుని పెంచాయి. ముఖ్యంగా అక్కడ బీజేపీ (BJP), కాంగ్రెస్(Congress) మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఇక పార్టీలు ప్రజల్లోకి మరింతగా వెళ్ళడానికి సినిమా వాళ్ళ గ్లామర్ ని కూడా వాడుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కన్నడ నటులు కర్ణాటక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరింతమంది సినిమావాళ్లని తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి.

తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్, హాస్య చక్రవర్తి బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప్రచారం చేశారు. బ్రహ్మానందం కర్ణాటకలో బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేశారు. కర్ణాటక ప్రస్తుత వైద్య శాఖ మంత్రి డాక్టర్ K సుధాకర్.. చిక్ బళ్లాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆ ఏరియాలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వారి ఓటింగ్ శాతం కూడా ఎక్కువ ఉంది. దీంతో బ్రహ్మానందంని తీసుకొచ్చి సుధాకర్ ప్రచారం చేయించారు.

Adire Abhi : ఢీ చైతన్య మాస్టర్ పై అదిరే అభి సంచలన వ్యాఖ్యలు.. మాకేం ఎక్కువ అమౌంట్ ఇవ్వట్లేదు.. జబర్దస్త్ వర్సెస్ ఢీ

ఎలక్షన్స్ ప్రచారంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ కి నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. వైద్యునిగా, మంత్రిగా ఆయన అనేక సేవలు చేశారు. అందుకే ఆయన తరపున ప్రచారం చేయడానికి వచ్చాను అని తెలిపారు. దీంతో బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్స్ లో ప్రచారం చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.