Brahmanandam Interesting Comments on Tharun Bhascker in Keeda Cola Pre Release Event
Brahmanandam : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో రాబోతున్నాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగా ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గెస్ట్ గా వచ్చాడు. ఇక ఈ కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. నన్ను కీడాకోలాలో ఎందుకు నటించారు అని చాలా మంది అడుగుతున్నారు. అసలు అదేం ప్రశ్న. నా సమాధానమైతే తరుణ్ భాస్కర్. తరుణ్ గతంలో తీసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూశాను. అవి నాకు బాగా నచ్చాయి. ఇలాంటి యువ దర్శకులతో కలిసి పనిచేయాలి అనుకున్నాను. కానీ నేను వెళ్లి సినిమాలో ఛాన్స్ అడగాలంటే నాకు కొద్దిగా ఈగో అడ్డొచ్చింది. వాళ్ళే వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చి అడిగితే బాగుండు అనుకునేవాడిని. తరుణ్ కీడాకోలా సినిమాలో నటించమని అడగడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ టీం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఇందులో కమెడియన్స్ తో, ఈ టీంతో నటిస్తే నాకు జంధ్యాల గారితో కలిసి పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి అని అన్నారు. బ్రహ్మ్మనందం చాలా రోజుల తర్వాత కొంచెం లెన్త్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుండటంతో ఆయన అభిమానులు అంతా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.