RRR : ‘ఆర్ఆర్ఆర్’ని ఆకాశానికి ఎత్తేసిన బ్రెజిల్ ప్రెసిడెంట్..
సాధారణ ప్రేక్షకుడి నుంచి విదేశీ ప్రముఖులు వరకు RRR ని పొగుడుతూనే వస్తున్నారు. తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ 'లులా డ సిల్వా' ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ..
- gum 95921
- Published on- September 10, 2023 / 04:32 PM IST
Brazil president Luiz Inácio Lula da Silva comments on RRR movie
RRR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యి ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా ఆ మూవీ పేరు వినిపిస్తూనే ఉంది. సాధారణ ప్రేక్షకుడి నుంచి విదేశీ ప్రముఖులు వరకు ఈ చిత్రాన్ని పొగుడుతూనే వస్తున్నారు. తాజాగా బ్రెజిల్ ప్రెసిడెంట్ ‘లులా డ సిల్వా’ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళిని ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేశారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లులాని.. ఇండియన్ సినిమాలు ఏమన్నా చూశారా..? అని ప్రశ్నించారు.
Bigg Boss 7 : మొదటి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..?
దానికి ఆయన బదులిస్తూ RRR చూసినట్లు చెప్పుకొచ్చారు. సినిమాలోని డ్రామా, మ్యూజిక్, డాన్స్, ఆర్టిస్ట్ ల నటన, దర్శకుడి టేకింగ్.. ఇలా ప్రతి ఒక్కటి ఎంతో బాగుంది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, దానికి రాజమౌళి రియాక్ట్ అయ్యి థాంక్యూ చెబుతూ రీట్వీట్ చేశాడు. “మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించారని మరియు RRRని ఆస్వాదించారని తెలుసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. మా టీం కూడా ఎంతో ఆనందంగా ఉంది. మీరు మా దేశంలో గొప్ప సమయాన్ని గడుపుతున్నారని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
Jawan Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తున్న జవాన్.. మూడు రోజుల్లో..!
ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఇండియన్ సినిమాకి ఇంతటి గుర్తింపు తీసుకు వచ్చిన రాజమౌళిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. RRR తోనే ఇంతటి ఫేమ్ ని తీసుకు వచ్చిన రాజమౌళి.. మహేష్ సినిమాతో ఇంకెంతటి గుర్తింపుని తీసుకు వస్తాడో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలు కాబోతుందని తెలుస్తుంది. అమెజాన్ అసువులు నేపథ్యంతో అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
