ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
అమరావతి : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వరకు సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సినిమా నిర్మాత, దర్శకుడికి కోర్టు నోటీసులు పంపించింది.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
ఏప్రిల్ 3న సాయంత్రం 4 గంటలకు సినిమాను జడ్జీల ముందు ప్రదర్శించాలని ఆదేశించింది. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. రేపు సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసుకుంది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడం చర్చనీయాంశమైంది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!