Buchi Babu Sana: చరణ్ కంటి నుండి రక్తం.. పెద్దాయన ఫోన్ చేస్తే గుండె ఆగినంత పనైంది.. బుచ్చిబాబు ఎమోషనల్!

పెద్ది సెట్స్ లో రామ్ చరణ్ కి జరిగిన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu Sana).

buchi babu emotional comments about ram charan accident on peddi sets

  • ‘పెద్ది’ సెట్స్‌లో రామ్ చరణ్‌కు గాయం.
  • భయంతో గుండె ఆగినంత పనైంది: బుచ్చిబాబు.
  • చిరంజీవి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

Buchi Babu Sana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక ప్రమాదం గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయమై రక్తం వచ్చిందని, ఆ దృశ్యం కెమెరాలోనే రికార్డ్ అయిందని ఆయన తెలిపారు.

*Trisha Krishnan: కుక్క ఫోటోతో కౌంటర్.. ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇచ్చిన త్రిష

కోట్లాది మంది అభిమానించే స్టార్ హీరోకు తన సెట్స్‌లో అలా గాయం కావడంతో తనకు చేతులు, కాళ్లు ఆడలేదని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఆ వెంటనే ఇంటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో, తనపై గట్టిగా తిడతారేమోనని విపరీతమైన భయంతో గుండె ఆగినంత పనైందని పేర్కొన్నారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబు(Buchibabu)కు చిరంజీవి ఊహించని విధంగా ఎంతో కూల్‌గా మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చారు.

చిరంజీవి గారు దర్శకుడిని అస్సలు తిట్టకుండా, ఎంతో పరిణతితో అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పారు. “కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు” అని చిరంజీవి ధైర్యం చెప్పిన తీరు, ఆయన ఇచ్చిన సపోర్ట్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని బుచ్చిబాబు ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.