Puri Jagannadh – Buchibabu Sana : పూరి జగన్నాధ్ గురించి పరిచయం అవసర్లేదు. ఇప్పుడంటే కాస్త తడబడుతున్నాడు కానీ ఒకప్పుడు ఇప్పటి స్టార్ హీరోలందరికీ పెద్ద హిట్స్ ఇచ్చి వాళ్ళని మాస్ హీరోలుగా మార్చింది ఈయనే అని అందరికి తెలిసిందే. ప్రస్తుతం పూరి తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నాడు.
ఇక సుకుమార్ దగ్గర ఎన్నో ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పనిచేసి ఉప్పెనతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సాన. ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా తీయడంలో బిజీగా ఉన్నాడు.
తాజాగా బుచ్చిబాబు సాన పూరి జగన్నాధ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. మేము ఇద్దరం ఒకే ఊళ్ళో పుట్టాము. అదే పిఠాపురం. మా ఇద్దరు తల్లులు మమ్మల్ని CMC హాస్పిటల్ లోనే డెలివరీ అయ్యారు. మేమిద్దరం ఇప్పుడు డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నాము. ఇది అంతా దేవుడి రాత. నాకు బాగా ఇష్టమైన మనుషుల్లో ఒకరు పూరి సర్ అని రాసుకొచ్చారు. దీంతో ఇద్దరూ ఒకే ఊళ్ళో, ఒకే హాస్పిటల్ లో పుట్టారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఇద్దరూ కూడా రామ్ చరణ్ తో వర్క్ చేసారు. చరణ్ ని పూరి లాంచ్ చేస్తే బుచ్చిబాబు తన రెండో సినిమా చరణ్ తో చేస్తున్నాడు.
Also Read : Oka Pathakam Prakaram : పూరి జగన్నాధ్ తమ్ముడు సినిమా ఓటీటీలోకి.. థ్రిల్లర్ కథతో..