Bujji and Bhairava Trailer
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా అతడికి తోడుగా బుజ్జి అనే రోబోటిక్ కారు ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఇటీవల బుజ్జి వెహికల్‌ను పరిచయం చేశారు.
కాగా.. ఈ సినిమా విడుదల కంటే ముందుగా బుజ్జిని చూడొచ్చు. బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను రూపొందించారు. ఈ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో బుజ్జి, భైరవలు కలిసి ప్రత్యర్థుల పని పట్టారు. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Producer Suryadevara Radhakrishna : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నిర్మాత తల్లి కన్నుమూత..