Pooja Hegde (image:Instagram)
Pooja Hegde: పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో బన్నీ-త్రివిక్రమ్ మ్యాజికల్ మూవీ అల వైకుంఠపురంలో సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూజ వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా దూసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బడా బడా సినిమాలతో హైలీ పెయిడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అన్ని బాషలలో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది.
ఈ బ్యూటీ ఖాతాలో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బీస్ట్ చిత్రాలు ఉండగా.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న బీస్ట్ షూటింగ్ దశలో ఉంది. ఇక బాలీవుడ్ లో సర్కస్, భాయిజాన్ సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఒక్కో సినిమా షూటింగ్ పూర్తవుతుంటే కొత్తగా మరింత క్రేజీ ప్రాజెక్టులు కూడా అమ్మడి ఖాతాలో వచ్చి చేరుతున్నాయి.
చాలా కాలం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద ప్రకటనకి ముందే భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుంది. పూజ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలలో నటించగా ఇది హరీష్ తో మూడవ సినిమా కానుంది. ఈ సినిమాలో పవన్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుండగా ‘ఇపుడే మొదలైంది’, ‘సంచారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు ప్రియమణి మరో కథానాయికగా నటించనుందని సినీ వర్గాలలో వినిపిస్తుండగా.. టైటిల్‌పై అదికారిక ప్రకటనతో పాటు సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వెలువడే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.