Bunny Vasu
Bunny Vasu : గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ కంటెస్టెంట్ కి ప్రచారం చేయడం, గతంలో జరిగిన పలు సంఘటనలతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ ఫ్యాన్స్ ని, పవన్ ని విమర్శించడం మొదలుపెట్టారు. వాళ్లిద్దరూ ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకర్నొకరు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇదే మంచి టైం అని పవన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఫ్యాన్స్ తో కలిసి పవన్ పై విమర్శలు చేసారు.(Bunny Vasu)
ఈ బన్నీ ఫ్యాన్స్ – పవన్ ఫ్యాన్స్ వివాదం సోషల్ మీడియాలో కొన్ని రోజులు బాగా నడిచింది. ఇటీవల అల్లు అర్జున్ నానమ్మ చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళింటికి వెళ్లి అల్లు అర్జున్ ని పరామర్శించడం, పదకొండో రోజు కార్యక్రమాలకు కూడా వెళ్లి బన్నీని పలకరించడం, వాళ్ళ ఫొటోలు వైరల్ అవ్వడంతో కొంతమంది ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఇంకా కొంతమంది మాత్రం ఇప్పటికి ఒకరి హీరోపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.
Also Read : Mahesh Babu Krishna : తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఏమేం సినిమాలు..
ఈ ఇద్దరికీ మధ్యలో ఎక్కువగా ఉండేది నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కి బన్నీ వాసు క్లోజ్ అని తెలిసిందే. అటు జనసేనలో కూడా బన్నీ వాసు కీలకంగా ఉన్నారు. గతంలోనే పలు మార్లు ఈ వివాదంపై స్పందిస్తూ వాళ్ళ మధ్య ఏం లేదు, వాళ్ళు బానే ఉన్నారు అని చెప్పారు.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ పవన్ గారికి, బన్నీకి సంబంధం లేకుండా జరిగిపోతాయి. నాకు ఇద్దరి గురించి తెలుసు. వాళ్ళు వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు అనుకునే మనస్తత్వాలు కావు. ఒకరి మీద ఒకరు కోపాలు పెట్టుకునే మనస్తత్వాలు కావు. మధ్యలో ఫ్యాన్ వార్స్, వాళ్ళు రాసే విధానం వాళ్ళు పెట్టే కామెంట్స్ చూసి చాలా బాధపడేవాడిని. నేను ఇద్దరితో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంతమంది ఫోన్స్ చేసేవాళ్ళు. నాకు ఫోన్ చేసి ఫ్యాన్స్ ఇలా అంటున్నారు వాళ్ళతో మాట్లాడండి అని, వాళ్లకు చెప్పండి అని చెప్పేవాళ్ళు. పవన్ గారు, బన్నీ ఇద్దరూ దీనిపై స్పందించరు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏం లేదు, వాళ్లకు అవసరం లేదు అని అన్నారు.
Also Read : Chiranjeevi Venkatesh : కొండవీటి రాజా – బొబ్బిలి రాజా ఒకే ఫ్రేమ్ లో.. టైగర్ మోడల్ డ్రెస్ లో.. ఫొటో వైరల్..
దీంతో బన్నీ వాసు కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా అభిమానులు ఫ్యాన్ వార్స్ ఆపుతారేమో చూడాలి. ఈ ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలకు కూడా నష్టం జరుగుతుంది. ఇటీవలే OG సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫ్యాన్ వార్స్ వద్దని, మేము అంతా ఒక్కటే అని, ఒకర్నొకరు గౌరవించుకుంటాం అని చెప్పారు.