వైకుంఠపురంలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్

‘అల వైకుంఠపురములో’ - బుధవారం ‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు..

  • Publish Date - December 16, 2019 / 09:07 AM IST

‘అల వైకుంఠపురములో’ – బుధవారం ‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’.. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ సాంగ్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి.

ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ చివర్లో ‘మీరిప్పుడే కార్ దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అంటూ సముద్రఖనితో బన్నీ చెప్పే డైలాగ్, కత్తితో బీడీ వెలిగించడం వంటివి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి.

బుధవారం ‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ బాగుంది. టబు, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సునీల్, సుశాంత్, నవదీప్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.