CAAపై రగడ : బాలీవుడ్‌ స్టార్స్, నిర్మాతలకు మోడీ ప్రభుత్వం ఆహ్వానం

  • Publish Date - January 5, 2020 / 01:56 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కోసం బాలీవుడ్ అగ్రశ్రేణి తారలను, నిర్మాతలను మోడీ ప్రభుత్వం ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో 2020, జనవరి 05వ తేదీ ఆదివారం ఈ సమావేశం జరుగనుంది.

కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, కబీర్ ఖాన్, రితేష్ సిద్వానీతో పాటు పలువురు ఆహ్వానించబడిన వారిలో ఉన్నారు. కానీ వీరిలో ఎంతమంది హాజరవుతారనే దానిపై క్లారిటీ లేదు. ఫిల్మ్ ప్రోడ్యూసర్ మహవీర్ జైన్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. గత ఎన్నికల్లో బాలీవుడ్ స్టార్స్‌తో మోడీ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

పౌరసత్వ సవరణ చట్టంపై సమగ్రంగా వారికి వివరించే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని అనుకుంటున్నట్లు ఓ యాక్టర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే..CAAపై బాలీవుడ్‌లో భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి. స్వరా భాస్కర్, వరుణ్ గ్రోవర్, విక్రమాదిత్య, అనుభవ్ సిన్హా, నీరజ్ ఘైవాన్ తదితరులు సోషల్ మీడియా వేదికగా CAAపై విమర్శలు గుప్పించారు. ఈ సమావేశం గురించి తనకు తెలియదని భాస్కర్ వెల్లడించారు. మరి ఈ చర్చల అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Read More : బెయిల్ డ్రామా : పోలీసులపై జేసీ ఆగ్రహం