×
Ad

Tollywood Drugs Case : సినీ తారల సీక్రెట్స్ చెప్పేసిన కెల్విన్.. ఇక స్టార్స్‌కు చిక్కులే..

విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది..

  • Published On : September 1, 2021 / 01:46 PM IST

Tollywood Drugs Case

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ విషయం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. కొంత విరామం తర్వాత మళ్లీ విచారణ చేపట్టారు. టాలీవుడ్ టు బాలీవుడ్ వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.

Karnataka : డ్రగ్స్ కేసు.. పోలీసుల కంటపడకుండా బాత్‌రూమ్ లో దాక్కున్న నటి

మంగళవారం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను దాదాపు 10 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పూరీను, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ సమక్షంలో విచారించారు.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు

ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారాడు. ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేశారు. కాగా విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది.

Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కార్యాలయంలో బండ్ల గణేష్

అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఈడీ అధికారుల ముందు డ్రగ్స్ తీసుకున్న సినిమా స్టార్స్ చిట్టా విప్పాడు. అతని స్టేట్‌మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు. డ్రగ్స్‌ లావాదేవీల వివరాలను కెల్విన్‌ ఈడీ ముందు బయటపెట్టడంతో.. సినీ తారలకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ కోసం కెల్విన్ అకౌంట్లోకి సినిమా వాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు. అతని బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నారు.