×
Ad

Chiru-Bobby: మెగా ప్రాజెక్టు నుంచి మిరాయ్ డైరెక్టర్ ఔట్.. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టెక్నీషియన్ కి ఛాన్స్.. అయితే ఇది కూడా..

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ టాప్ స్టార్. ఈయన సినిమాకి కనీసం ఒకసారైనా వర్క్ చేయాలని(Chiru-Bobby) చాలా మంది టెక్నీషియన్స్ అనుకుంటారు. అంతేకాదు, ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా.

Cameraman Nimish Ravi to work on Chiranjeevi-Bobby Kolli film

Chiru-Bobby: మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ టాప్ స్టార్. ఈయన సినిమాకి కనీసం ఒకసారైనా(Chiru-Bobby) వర్క్ చేయాలని చాలా మంది టెక్నీషియన్స్ అనుకుంటారు. అంతేకాదు, ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. అలాంటి అవకాశమే యంగ్ కెమెరామెన్ కి వచ్చింది. దానికి ఆ కెమెరామెన్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఏమయిందో తెలియదు ఇప్పుడు ఆ అవకాశం అతని నుంచి వేరే టెక్నీషియన్ కి మారింది. ఆ కెమెరామెన్ మరెవరో కాదు కార్తీక్ ఘట్టమనేని. ఇతను కేవలం కెమెరామెన్ మాత్రమే కాదు గొప్ప దర్శకుడు కూడా.

Anu Emmanuel: రెండు స్టెప్పులు, నాలుగు డైలాగ్స్.. స్టార్స్ సినిమాల్లో ఉండేవి ఇవే.. ఆ సినిమాలు చేసినందుకు ఫీలవుతున్నా

ఇటీవలే మిరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమాలోని విజువల్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు బాబీ కొల్లి మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు కెమెరామెన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని కార్తీక్ ఘట్టమనేని దగ్గర ప్రస్తావించగా ఆయన కూడా అవును అన్నట్టుగానే కామెంట్స్ చేశాడు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి కార్తీక్ ఘట్టమనేనిని తప్పించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన లోక సినిమాకు అద్భుతమైన కెమెరా వర్క్ అందించిన నిమిష్ రవిని తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అఫిషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో, కార్తీక్ ఘట్టమనేని ఫ్యాన్స్ కాస్తా డిజప్పాయింట్ అవుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా విషయానికి వస్తే ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను తమిళ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఎడారి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తరువాత బాబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాదిస్తుందో చూడాలి.