Anu Emmanuel: రెండు స్టెప్పులు, నాలుగు డైలాగ్స్.. స్టార్స్ సినిమాల్లో ఉండేవి ఇవే.. ఆ సినిమాలు చేసినందుకు ఫీలవుతున్నా

మజ్ను సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel). నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Anu Emmanuel: రెండు స్టెప్పులు, నాలుగు డైలాగ్స్.. స్టార్స్ సినిమాల్లో ఉండేవి ఇవే.. ఆ సినిమాలు చేసినందుకు ఫీలవుతున్నా

Heroine Anu Emmanuel makes shocking comments on star hero's movies

Updated On : November 11, 2025 / 6:27 PM IST

Anu Emmanuel: మజ్ను సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది ఫారెన్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో చాలా పద్దతిగా కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్. చేసింది చిన్న సినిమానే(Anu Emmanuel) అయిన అవకాశాలు మాత్రం గట్టిగానే పట్టేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, అదృష్టం మాత్రం వరించలేదు. మజ్ను తరువాత ఆమె చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు.

Ram Charan-Sukumar: విలన్ గా అలనాటి స్టార్.. సుకుమార్ ప్లానింగ్ మాములుగా లేదుగా.. త్వరలోనే రామ్ చరణ్ సినిమా..

అందుకే ఇతర భాషల్లో తన లక్కుని టెస్ట్ చేసుకుంది ఈ బ్యూటీ. కానీ, అక్కడ కూడా ఫేట్ మారలేదు. వరుస ప్లాప్స్ పలకరించాయి. అయినప్పటికి, మంచి మంచి అవకాశాలు దక్కించుకుటుంది అను ఇమ్మాన్యుయేల్. తాజాగా ఈ అమ్మడు చేసిన సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర కూడా ఆడియన్స్ ను మెప్పించింది. దీంతో ఆమె పేరు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అను ఇమ్మాన్యుయేల్ తన సినిమాల గురించి, తాను చేసిన పాత్రల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ కథ, అందులో నా పాత్ర నాకు బాగా నచ్చాయి. ఎలాగైనా ఈ సినిమాలో నటించాలని వెంటనే ఒకే చెప్పేశాను. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే ఒక గొప్ప సినిమా ఇది. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఆడియన్స్ నుంచి వస్తున్న వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. నేను పవన్ కల్యాణ్, అల్లు అర్జున్,నాగ చైతన్య, నాని, కార్తి, విశాల్,శివకార్తికేయన్ లాంటి చాలా మంది స్టార్స్ తో నటించాను. వాటిలో కొన్ని సినిమాలు చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కమర్షియల్ సినిమాలలో ఎలాంటి సంతృప్తి ఉండదు. నాలుగు స్టెప్స్, కొన్ని డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. ఇకపై అలాంటి మూవీస్ చేయను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అను. మరి ఇకనైనా ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.