Ram Charan-Sukumar: విలన్ గా అలనాటి స్టార్.. సుకుమార్ ప్లానింగ్ మాములుగా లేదుగా.. త్వరలోనే రామ్ చరణ్ సినిమా..
పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు దర్శకుడు సుకుమార్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. (Ram Charan-Sukumar)ఈ సినిమాను ఆయన డీల్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
director sukumar to cast senior actor rajasekhar as villain in ram charan film
Ram Charan-Sukumar: పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు దర్శకుడు సుకుమార్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఈ సినిమాను ఆయన డీల్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అంతా భారీ అంచనాలు క్రియేట్ అయినప్పటికీ ఏమాత్రం భయం(Ram Charan-Sukumar) లేకుండా సినిమాను విడుదల చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేశాడు సుకుమార్. ఆ విషయంలో ఆయనది మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. రంగస్థలం నుంచి మేకింగ్ స్టయిల్ మార్చిన సుకుమార్ ఆ తరువాత నుంచి రా అండ్ రస్టిక్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు.. సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
దీంతో, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ అందరిలోను నెలకొంది. ఇందులో భాగంగానే ఆయన తన నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇందులో భాగంగానే, రామ్ చరణ్-సుకుమార్ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, సుకుమార్ అయన సినిమాల్లో హీరోల విషయంలోనే కాదు విలన్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళకి ఒక డిఫరెంట్ క్యారక్టరైజేషన్ ను సెట్ చేస్తాడు. రంగస్థలంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్.. పుష్ప సినిమాలోఫహద్ ఫాజిల్ ఇలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే, రామ్ చరణ్ సినిమాలో కూడా ఒక కొత్త బడీ లాంగ్వేజ్ ఉన్న నటుడిని ఫిక్స్ చేశాడట సుకుమార్. ఆ నటుడు మరెవరో కాదు యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్. అవును, ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఆపోజిట్ గా రాజశేఖర్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాడు ఫిక్స్ అయ్యాడట సుకుమార్. ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం కానుంది అని టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఈవిషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే సుకుమార్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నారు రామ్ చరణ్.
