Cannes 2024 : కాన్స్‌లో ఇండియన్ షార్ట్‌ ఫిల్మ్‌కి ఫస్ట్ ప్రైజ్.. హీరో య‌శ్ ట్వీట్ వైర‌ల్‌

77వ కేన్స్​ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియ‌న్ షార్ట్ ఫిల్మ్ మొద‌టి బ‌హుమ‌తిని సొంతం చేసుకుంది.

77వ కాన్స్‌​ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియ‌న్ షార్ట్ ఫిల్మ్ మొద‌టి బ‌హుమ‌తిని సొంతం చేసుకుంది. ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ అనే లఘు చిత్రం బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్‌ విభాగంలో మొద‌టి ప్రైజ్‌ను గెలుచుకుంది. వివిధ భాష‌ల‌కు చెందిన 17 చిత్రాలు ఈ జాబితాలో పోటి ప‌డ్డాయి. క‌న్న‌డ జాన‌పద క‌థ ఆధారాంగా రూపొందించిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ ఉత్త‌మ లఘు చిత్రంగా నిలిచింది. ఈ ల‌ఘు చిత్రం నిడివి దాదాపు 16 నిమిషాలు..

ఈ ల‌ఘు చిత్రం క‌థ ఏంటంటే..?
ఓ వృద్ధురాలు పెంచుకుంటున్నకోడిని ఎవరో దొంగిలిస్తారు. ఆ కోడిని క‌నుగొన‌డం కోసం ఆమె ప‌డే త‌ప‌న ఇందులో క‌ళ్ల‌కు కట్టిన‌ట్లుగా చూపించారు.

Yevam Teaser : ‘యేవమ్’ టీజర్ రిలీజ్.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి..

య‌శ్ ట్వీట్‌..
కాన్స్‌లో ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో’ ఉత్త‌మ ల‌ఘు చిత్రంగా నిల‌వ‌డం ప‌ట్ల క‌న్న‌డ స్టారో హీరో య‌శ్ ఆనందం వ్య‌క్తం చేశాడు. చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశాడు. క‌న్న‌డ జాన‌ప‌ద సాహిత్యాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ల‌డం బాగుంద‌ని, భార‌తీయ సినిమాకి కొత్త బెంచ్ మార్క్‌ల‌ను సెట్ చేయ‌డం చూసి గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు ట్వీట్ చేశాడు.

Ashika Ranganath : మొన్న నాగార్జున.. ఇవాళ చిరంజీవి.. ఇంత అందాన్ని సీనియర్స్ పక్కన వాడేస్తున్నారేంటి?

అలాగే.. ‘బ‌న్నీ హుడ్’ అనే యానిమేటెడ్ సినిమాకి మూడో బ‌హుమ‌తి ల‌భించింది. దీన్ని మేరఠ్‌లో జన్మించిన భారతీయ చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించింది. విజేత‌ల‌కు మే 23న బునుయెల్‌ థియేటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఉత్తమ లఘు చిత్రానికి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలు అందించారు.

ట్రెండింగ్ వార్తలు