Ranveer Singh
Ranveer Singh : ఇటీవల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ కాంతార గురించి పొగుడుతూ ఆ సినిమాలో హీరో చేసిన హావభావాలను ట్రై చేసాడు. అది కాస్తా కామెడీగా చేయడంతో వివాదంగా మారింది. వాళ్ళు కొలిచే దైవానికి సంబంధించిన హావభావాలను వికృతంగా, వ్యంగ్యంగా చేసాడని రణవీర్ సింగ్ పై విమర్శలు చేయగా పెద్ద వివాదమే అయింది. గతంలోనే పలువురు కేసులు కూడా పెట్టారు రణవీర్ పై.(Ranveer Singh)
దీంతో రణవీర్ సింగ్ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదం కొన్ని రోజుల క్రితమే ముగిసింది అని అంతా అనుకున్నారు. తాజాగా బెంగుళూరులో ఈ వివాదాన్ని మరోసారి గుర్తుచేస్తూ రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేసారు.
బెంగుళూరు హై గ్రౌండ్ పోలి స్టేషన్ లో హిందూ నమ్మకాలను, చావుండి దైవ ఆచారాలను అవమానించాడని రణవీర్ సింగ్ పై కేసు నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్స్ 196, 299, 302 పై ప్రశాంత్ మెతల్ అనే బెంగుళూరు లాయర్ ఈ కేసు నమోదు చేసారు.
FIR ప్రకారం.. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ దైవ ఆచారాలను ఇమిటేట్ చేస్తూ వేదికపై అవమానించాడని పేర్కొన్నారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో చూసాను ఆ వీడియో అని తెలిపాడు. రణ్‌వీర్ సింగ్ పంజుర్లి, గులిగా దైవాలతో సంబంధం ఉన్న వ్యక్తీకరణలను హాస్యభరితమైన, అవమానకరమైన రీతిలో అనుకరించాడని, పవిత్రమైన చావుండి దైవాన్ని స్త్రీ దెయ్యం గా పేర్కొన్నాడని, ఇది దైవ సంప్రదాయం పాటించే భక్తులకు తీవ్ర మానసిక వేదన కలిగించిందని ఫిర్యాదులో ఆరోపించారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి, సమాజంలో ద్వేషం ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ చర్య ఉద్దేశపూర్వకంగా చేసాడని FIR లో పేర్కొన్నారు. ఈ కేసు ఏప్రిల్ 8న విచారణకు రానుంది. మరి దీనిపై రణవీర్ మళ్ళీ స్పందిస్తాడా చూడాలి.
Also Read : Keerthi Bhat : ఎంగేజ్మెంట్, లివ్ ఇన్ రిలేషన్.. ఇప్పుడు బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ భామ..