Vijay : ఎన్నికల వేళ విజయ్ పై కేసు నమోదు.. పోటీ చేస్తున్న ఊళ్ళోనే..
విజయ్ పై తాజాగా కేసు నమోదయింది. (Vijay)
- Saketh U
- Published On : March 31, 2026 / 11:36 AM IST
Vijay
Vijay : తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తన పార్టీ అభ్యర్థులను పోటీకి దింపుతున్న సంగతి తెలిసిందే. విజయ్ పెరంబూర్, త్రిచీ ఈస్ట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాడు.
విజయ్ పై తాజాగా కేసు నమోదయింది. ఇటీవల విజయ్ పెరంబూర్ లో నామినేషన్ వేయడానికి రోడ్ షో చేస్తూ వెళ్లారు. దీంతో భారీగా విజయ్ ఫ్యాన్స్, జనాలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. ఎలక్షన్ మానిటరింగ్ అధికారి ఈ మేరకు ఫిర్యాదు చేసారు.
Also Read : Mega Family : మెగా కోడళ్ళు, ఆడపడుచులు అంతా ఒకే చోట.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన పవన్ భార్య..
ఆ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విజయ్ ప్రచారంలో పరిమితి మించి 30 లౌడ్‌స్పీకర్లు వినియోగించారని, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని, 5000 కంటే ఎక్కువ మందిని సమీకరించారని, ప్రజలకు అసౌకర్యం కల్గించారని, ట్రాఫిక్ నెలకొందని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీసులు ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని చర్యలు ప్రారంభించారు. అలాగే పలువురు టీవీకే కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు.
దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. పర్మిషన్ ఉన్నా, అభ్యర్థించిన ఎన్నికల ప్రచారం కోసం పోలీసులు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేదని అన్నారు. చెన్నై పోలీసులు తమకు భద్రత కల్పిస్తూ, తమ ప్రచారాల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని టీవీకే విజ్ఞప్తి చేసింది. మరి ఈ కేసులపై విజయ్ స్పందిస్తారేమో చూడాలి.
