‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సేషనల్ 50 డేస్ – ఫ్యాన్స్‌కు మహేష్ థ్యాంక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సూపర్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజులు పూర్తి చేసుకుంటోంది..

  • Publish Date - February 29, 2020 / 06:53 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సూపర్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ 50 రోజులు పూర్తి చేసుకుంటోంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచింది. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ఆమె చేసిన ప్రొఫెసర్ భారతి క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సూపర్ స్టార్ మిలటరీ మేజర్‌ అజయ్ కృష్ణగా అలరించాడు. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగుతో ఎంటర్‌టైన్ చేశాడు. జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ఫిబ్రవరి 29 నాటికి అన్ని ప్రధాన కేంద్రాలలో సక్సెస్ ఫుల్‌గా  50 డేస్ కంప్లీట్ చేసుకుంది.

ఈ సందర్భంగా మహేష్, అనిల్ రావిపూడి, నిర్మాతలు అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 50 డేస్ ప్రోమోతో పాటు ‘మైండ్ బ్లాక్’ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. #MASSMB  #50DaysOfBBSLN  #AllTimeBlockBusterSLN హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రెండ్ అవుతోంది.

See Also | శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’..