Chiranjeevi : ‘పద్మవిభూషణుడు’ చిరంజీవికి అభినందనల వెల్లువ.. సెలబ్రెటీలు ఎవరెవరు విషెష్ చెప్పారంటే..

మెగాస్టార్ కి నిన్న రాత్రి నుంచే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

Celebrities congratulated Megastar Chiranjeevi selected for the Padma Vibhushan award

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సొంతంగా కష్టపడి కింద స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదిగి, 150కి పైగా సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలిచిన చిరంజీవికి గతంలోనే పద్మభూషణ్ అవార్డు వరించగా ఇప్పుడు పద్మ విభూషణ్ వరించింది. దీంతో మెగాస్టార్ కి నిన్న రాత్రి నుంచే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తున్నారు. కొంతమంది డైరెక్ట్ గా కలిసి, ఫోన్లు చేసి చెప్తుండగా పలువురు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియచేస్తున్నారు.

వెంకటేష్, డైరెక్టర్ మారుతి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రశాంత్ వర్మ, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రాజమౌళి, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, నారా రోహిత్, రాధికా, డైరెక్టర్ వశిష్ఠ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా అనేక రంగాల ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.