National Doctors Day : ‘వైద్య నారాయణోహరిహి’ డాక్టర్లకు సెల్యూట్..

నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ల యొక్క సేవాగుణానికి సెల్యూట్ చేస్తూ.. సామాన్యులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

National Doctors Day

National Doctors Day: కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఎంతోమంది వైద్య సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు.. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ల యొక్క సేవాగుణానికి సెల్యూట్ చేస్తూ.. సామాన్యులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు వైద్యులకు డాక్టర్స్ డే విషెస్ తెలియజేశారు.

‘ప్రాణాలను రక్షించగలిగే వారు డాక్టర్లు ఒక్కరే వైద్య నారాయణోహరిహి.. సర్వశక్తిమంతుడైన దేవుని మానవ రూపాలు వైద్యులు.. ఈ ప్రపంచ ఆరోగ్య సంక్షోభ సమయంలో ఈ వాస్తవం మరోసారి బలోపేతం అయ్యింది’ అంటూ చిరంజీవి ట్వీట్ ద్వారా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు..

‘జీవితాన్ని రక్షించేవారు .. ఎప్పుడూ గొప్ప వీరులు.. డాక్టర్స్.. మానవత్వం యొక్క సంక్షేమానికి మీ సహకారం మరియు నిబద్ధత అసమానమైనవి. ఎల్లప్పుడూ  వైద్యులందరికీ ధన్యవాదాలు! కృతజ్ఞతలు’.. అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు..