Music Director Raj : సంగీత దర్శకుడు రాజ్ మరణంపై సినీ ప్రముఖుల నివాళులు..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

Celebrities paying tributes to Music Director Raj

Raj :  ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director) రాజ్(Raj) నిన్న మే 21 సాయంత్రం మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రాజ్ – కోటి సంగీత ద్వయం టాలీవుడ్ లో చాలా పాపులర్. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ కాంబినేషన్.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.