వైభవంగా కోడిరామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక వివాహం – హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు..
ప్రముఖ దర్శకులు.. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన స్వర్గీయ.. కోడి రామకృష్ణ గారి రెండో కుమార్తె కోడి ప్రవల్లిక వివాహం మహేష్‌తో బుధవారం రాత్రి 9.36 నిమిషాలకు హైదరాబాద్ గండిపేటలోని కన్వెషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
కోడిరామకృష్ణ సతీమణి కోడి పద్మ ఆహ్వానం మేరకు తెలుగు చలనచిత్ర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, మోహన్ బాబు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కె.రాఘవేంద్రరావు, మురళీ మోహన్, గోపీచంద్, జయప్రధ, జీవిత, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె.విజయభాస్కర్, బి.గోపాల్, అల్లు అరవింద్, దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు, పోకూరి బాబూరావు, పరుచూరి గోపాలకృష్ణ, దేవీప్రసాద్, వీరశంకర్,
శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బయ్య, సీనియర్ హీరో వినోద్‌కుమార్, కాశీ విశ్వనాథ్, అలీ, హేమ, బాలకృష్ణ సతీమణి వసుంధర, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ సతీమణి నిర్మల, నాగబాబు సతీమణి పద్మజ, కుమార్తె నిహారిక, నటి శివపార్వతి, రాజశేఖర్ కుమార్తె శివాని తదితరులుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.