Telangana Elections 2023 : ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిస్తున్న సెలబ్రిటీలు

నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోమంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత వివరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.

Telangana Elections 2023 : ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిస్తున్నారు సెలబ్రిటీలు. నటి ఇంద్రజ, నటుడు అదిరే అభి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. వీరి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోమంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎక్కడ ఉన్నాసరే ఓటు హక్కును వదులుకోవద్దని చెప్పారు నటి ఇంద్రజ. తప్పకుండా బూత్‌కి వెళ్లి ఓటు చేయండి అని పిలుపునిచ్చారు. ఓటు చెల్లించడం మాత్రం మర్చిపోవద్దని సూచించారు.

Also Read : ఆ స్టార్ డైరెక్టర్‌తో తమిళ నటుడు ప్రభు కూతురి పెళ్లి..

నటుడు అదిరే అభి సైతం ఓటు హక్కు వినియోగించుకోమంటూ వీడియో పోస్టు చేశారు. ఓటు వేసేటపుడు బాగా ఆలోచించుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వెయ్యమని సూచించారు. ఏ పార్టీకి ఓటు వెయ్యడం ఇష్టలేకపోతే మీ ఓటు దుర్వినియోగం కాకుండా నోటాకైనా ఓటు వేయమని చెప్పారు.

Also Read: కత్రీనా కైఫ్ ‘టవల్ ఫైట్‌’పై ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నారంటే?

ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత పలు సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అదిరే అభి నటుడిగా పలు సినిమాల్లో నటించారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు