Vicky Kaushal : కత్రీనా కైఫ్ ‘టవల్ ఫైట్‌’పై ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నారంటే?

టైగర్ 3 సినిమాలో కత్రీనా కైఫ్ 'టవల్ ఫైట్' చాలా పాపులర్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి ఆమె ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆమె భర్త టవల్ ఫైట్‌పై స్పందించారు.

Vicky Kaushal : కత్రీనా కైఫ్ ‘టవల్ ఫైట్‌’పై ఆమె భర్త విక్కీ కౌశల్ ఏమన్నారంటే?

Vicky Kaushal

Vicky Kaushal : ‘టైగర్ 3’ లో కత్రీనా కైఫ్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా కత్రీనా కైఫ్ ‘టవల్ ఫైట్’ బాగా వైరల్ అయ్యింది. ఈ ఫైట్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ టవల్ ఫైట్‌పై కత్రీనా భర్త నటుడు విక్కీ కౌశల్ స్పందించారు.

నటుడు విక్కీ కౌశల్ తాజా చిత్రం ‘సామ్ బహదూర్’.. రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాతో పాటు డిసెంబర్ 1 న రిలీజ్ అవుతోంది. తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విక్కీ కౌశల్ ఇటీవల తన భార్య నటి కత్రీనా నటించిన ‘టైగర్ 3′ సినిమా గురించి ముఖ్యంగా అందులో కత్రినా టవల్ ఫైట్ గురించి స్పందించారు. కత్రీనాతో కలిసి టైగర్ 3 సినిమా చూసానని తను అద్భుతమైన యాక్షన్ నటి అని విక్కీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా టవల్ ఫైట్‌లో ఆమె నటన అద్భుతమన్నారు. ఆ ఫైట్ కోసం ఆమె పడిన కష్టానికి గర్వపడుతున్నానని.. ఆమెను అలా చూడతం తనకెంతో స్ఫూర్తిని కలిగించిందని విక్కీ చెప్పారు. ఇక నుంచి తనతో ఎప్పుడూ వాదించనని, టవల్‌తో తను నన్ను కొట్టడం ఇష్టంలేదని’ ఫన్నీ కామెంట్స్ చేశారు విక్కీ.

Also Read : రణబీర్ కపూర్ నన్ను ఏడిపిస్తున్నారు..

రిస్క్‌తో కూడిన యాక్షన్ సీన్స్ చేసి హీరోలకు తీసిపోని విధంగా నటించారు కత్రీనా కైఫ్. టవల్ ఫైట్‌లో కత్రీనా మరో మహిళతో పోరాడే సన్నివేశంపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’ సినిమా రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1 న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో కౌశల్‌తో పాటు సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రల్లో నటించారు.

Also Read : రాజేంద్రప్రసాద్‌ ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి..