Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి..

రాజేంద్రప్రసాద్‌ ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఫోటోలు షేర్ చేసిన..

Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి..

Senior Actor Rajendra Prasad Shashtipoorthi celebrations

Updated On : November 30, 2023 / 7:16 PM IST

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మద్యమద్యలో ప్రధాన పాత్రలు పోషించి పలు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల ఓటీటీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సేనాపతి, కృష్ణరామ అంటూ ఓటీటీ కంటెంట్ తో కూడా నేటి ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘షష్టిపూర్తి’ వేడుకలు అంటే నిజమైన కార్యక్రమం అనుకుంటున్నారేమో.. కాదండోయ్. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను కూడా చూపించారు. కాగా ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ కి భార్యగా అర్చన నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ ‘లేడీస్ టైలర్’ సినిమాలో కలిసి నటించారు. అప్పుడు ఈ జోడి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి జోడికి మంచి మార్కులు పడినప్పటికీ.. ఆ మూవీ తరువాత మరోసారి ఇద్దరు కలిసి మళ్ళీ నటించలేదు.

Also read : Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ ‘షష్టిపూర్తి’.. కానీ తన భార్యతో కాదు!

దాదాపు 37 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ జంట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. న్యూ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ స్టోరీ షష్టిపూర్తి కథాంశంతో ఉండనుంది. దీంతో సినిమా కథ మొత్తం రాజేంద్రప్రసాద్‌, అర్చన చుట్టూనే తిరగనుంది. రూపేష్‌ కుమార్‌ చౌదరి, ఆకాంక్షసింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్‌, ఆచ్యుత్‌ కుమార్‌, వై విజయ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. రూపేష్‌కుమార్‌ చౌదరి నిర్మాణంలో పవన్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.