Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ‘షష్టిపూర్తి’.. కానీ తన భార్యతో కాదు!
రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తనతో కలిసి లేడీస్ టైలర్ (Ladies Tailor) సినిమాలో నటించిన అర్చనతో (Archana) షష్టిపూర్తి చేసుకోడానికి సిద్దమవుతున్నాడు.
![Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ‘షష్టిపూర్తి’.. కానీ తన భార్యతో కాదు! Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ‘షష్టిపూర్తి’.. కానీ తన భార్యతో కాదు!](https://10tv.in/wp-content/uploads/2023/04/Rajendra-Prasad-and-Archana-are-collaborated-for-shastipoorthi-after-Ladies-Tailor-movie.jpg)
Rajendra Prasad and Archana are collaborated for shastipoorthi after Ladies Tailor movie
Rajendra Prasad : టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలా 19’s లో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన కాంబినేషన్ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), డైరెక్టర్ వంశీ (Vamsy). వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్టుగా నిలిచాయి. వాటిలో లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ ఫస్ట్ విడుదల.. సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు. ముఖ్యంగా లేడీస్ టైలర్ (Ladies Tailor) సినిమా చాలా మందికి ఫేవరేట్ మూవీ. మరాఠి సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన (Archana) జంటగా నటించారు.
Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ ‘షష్టిపూర్తి’ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి..
ఆ సినిమా తరువాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించ లేదు. దాదాపు 37 ఏళ్ల తరువాత ఇప్పుడు రాజేంద్రప్రసాద్, అర్చన జోడీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీరిద్దరూ ప్రధాన పాత్రలో ‘షష్టిపూర్తి’ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షసింగ్ (Aakanksha Singh) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీ స్టోరీ షష్టిపూర్తి కథాంశంతో ఉండనుంది. దీంతో సినిమా కథ మొత్తం రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. అలాగే సంగీతం ప్రధానంగా కూడా సినిమా కథ సాగనుంది.
Costume Krishna : టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ ప్రభ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా శనివారం (ఏప్రిల్ 1) చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇళయరాజా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రూపేష్‌కుమార్ చౌదరినే ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, జూలైలో మూవీని రిలీజ్ చేస్తామంటూ తెలియజేశాడు. కాగా ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, ఆచ్యుత్ కుమార్, వై విజయ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
#LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for #Shastipoorthi.
“Shoot starts this month and release in August” says @ActorRupesh.
An #Ilaiyaraaja musical.#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1 #AchyuthKumar pic.twitter.com/0A9mDyw0rI
— M.L.Prabhakaran. (@muniPrabhakaran) April 2, 2023