Celina Jaitly: మంచు విష్ణు హీరోయిన్ కి మాజీ భర్త నోటీసులు.. గృహహింస వివాదంలో సరికొత్త మలుపు

బాలీవుడ్ నటి సెలినా జైట్లీ(Celina Jaitly)కి ఆమె భర్త పీటర్ హాగ్, మామగారు డాక్టర్ వోల్ఫ్‌గ్యాంగ్ జె. హాగ్ నుండి రెండు లీగల్ నోటీసులు అందాయి.

Bollywood heroine Celina Jaitly husband Peter Haag takes legal action against her

  • సెలినాకు భర్త లీగల్ నోటీసులు.
  • పరువు నష్టం ఆరోపణలపై హెచ్చరిక.
  • గృహహింస కేసులో సరికొత్త మలుపు.

Celina Jaitly: ప్రముఖ బాలీవుడ్ నటి సెలినా జైట్లీ, ఆమె భర్త పీటర్ హాగ్ మధ్య గత కొన్ని నెలలుగా నడుస్తున్న వైవాహిక వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఆస్ట్రియా కోర్టుల్లో వీరి వివాహం, పిల్లల కస్టడీకి సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగానే.. సెలినాకు ఆమె భర్త పీటర్ హాగ్, మామగారు డాక్టర్ వోల్ఫ్‌గ్యాంగ్ జె. హాగ్ నుండి రెండు లీగల్ నోటీసులు అందాయి. సెలినా(Celina Jaitly) ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ కుటుంబంపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేస్తున్నారని వారు ఆ నోటీసులలో పేర్కొన్నారు.

Neha Shetty: నెటెడ్ డ్రెస్సులో నేహా శెట్టి గ్లామర్ అటాక్.. నయా లుక్ తో సెన్సేషన్.. ఫొటోలు

ఈ మీడియా పబ్లిసిటీ వల్ల తమ ముగ్గురు మైనర్ పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోందని హాగ్ కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు సంబంధించిన విషయాలను అత్యంత గోప్యంగా ఉంచాలని, సమాంతర మీడియా ట్రయల్స్ జరపకూడదని స్పష్టం చేసింది. వివాదాస్పద కంటెంట్‌ను వెంటనే తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది.

సెలినా జైట్లీ 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో కవల పిల్లలు జన్మించగా, 2017లో మరోసారి కవలలు జన్మించారు (అయితే ఒక బాబు గుండె జబ్బుతో మరణించాడు). కాగా, తన భర్త పీటర్ తనను నిరంతరం గృహహింసకు గురిచేశాడంటూ గత ఏడాది (నవంబర్ 2025) సెలినా కేసు ఫైల్ చేయడంతో వీరి వివాదం వెలుగులోకి వచ్చింది.