Censor Board Chairman Prasoon Joshi shocking comments about Toxic teaser controversy.
Toxic: కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడమే.
మార్చ్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా టాక్సిక్(Toxic) సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఆ టీజర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ టీజర్ పై సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా నుంచి కూడా ఈ టీజర్ ను డిలేట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Deepika Pilli: పతంగ్ ఎగరేస్తున్న దీపికా పిల్లి.. సంక్రాంతి స్పెషల్ ఫొటోస్ వైరల్
అంతేకాదు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ టీజర్ విషయంలో అభ్యంతాలు వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ పై నిప్పులు చెరుగుతున్నాయి. అయితే, సెన్సార్ విభాగంపై వస్తున్న కామెంట్స్ పై సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ‘టాక్సిక్ టీజర్ వివాదంపై నేను కామెంట్స్ చేయలేను. కానీ, ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసే వీడియోలకు సెన్సార్ ఉండదు.
వాటి నియంత్రణ మా పరిధిలో లేదు. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతీ వీడియో సెన్సార్ అవుతుంది అనే ఆలోచనను వదలండి. ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ అవుతుంది అనుకుంటున్నారు చాలా మంది. కానీ, అవి మా వద్దకు రావు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.