Chalapathi Rao maintain special bond with nandamuri family
Chalapathi Rao : గత కొన్ని రోజులుగా తెలుగు సినీపరిశ్రమ అలనాటి తారలను కోలుపోతూ శోకసంద్రంలో మునిగి తేలుతుంది. నేడు సీనియర్ నటుడు చలపతి రావు గారి అకాల మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. 78 ఏళ్ళ వయసు చలపతి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించారు. 22 ఏళ్ళ వయసులో సినీ రంగప్రవేశం చేసిన చలపతి, దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు.
Chalapathi Rao : చలపతి రావు కొడుకు ఎవరో తెలుసా?
కాగా చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయన కెరీర్ లో ఒక హీరోతో అత్యధికంగా సినిమాలు చేసిందంటే.. అది సీనియర్ ఎన్టీఆర్‌తోనే, అంతేకాదు ఆ తరువాత కూడా నందమూరి వారసులైన బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలో చలపతి ఎక్కువుగా కనిపిస్తూ ఉండేవారు. బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’, ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాల్లో చలపతి పాత్ర హీరోలతో సమానంగా ఉంటుంది.
సినిమాలోనే కాదు రాజకీయపరంగాను నందమూరి కుటుంబంతో సాన్నిహిత్యం కొనసాగించారు చలపతి. నందమూరి తారక్ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా పార్టీకి తనవంతు సహకారం అందిస్తూ వచ్చారు. ఇక అయన మరణవార్త తెలిసిన బాలకృష్ణ.. అయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించాడు. చలపతి నాన్నగారితో పాటు తన చిత్రాల్లో కూడా నటించారు అంటూ గుర్తు చేసుకున్నాడు.