చాణక్య – సెన్సార్ పూర్తి
మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్.. 'చాణక్య' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..

మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్.. ‘చాణక్య’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా.. ‘చాణక్య’.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి..
రీసెంట్‌గా చాణక్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కథా కథనం, గోపిచంద్ హై ఓల్టేజ్ యాక్షన్, మెహరీన్ గ్లామర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ హైలెట్ అయ్యాయని.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.
Read Also : నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’
దసరా కానుకగా అక్టోబర్ 5న చాణక్య గ్రాండ్‌గా విడుదలవుతోంది. కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, బ్యాగ్రౌండ్ స్కోర్ : శ్రీ చరణ్ పాకాల, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తిరు.