చందమామే చేతికందే-లిరికల్ వీడియో
118 మూవీలోని, చందమామే చేతికందే ఆడియో అండ్ లిరికల్ వీడియో రిలీజ్.

118 మూవీలోని, చందమామే చేతికందే ఆడియో అండ్ లిరికల్ వీడియో రిలీజ్.
నందమూరి కళ్యాణ్ రామ్, నివేథా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్స్‌గా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, 118. ఈ మూవీతో కె.వి.గుహన్ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మొన్నామధ్య రిలీజ్ చేసిన 118 ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా చందమామే చేతికందే అనే ఆడియో సాంగ్‌తో పాటు లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేసారు. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ట్యూన్‌కి, రామ్ ఆంజనేయులు అందమైన లిరిక్స్ రాసాడు. ఓ మై గాడ్ ఏం చేసావ్, చెక్కు ఇచ్చి సంతకాన్ని ఆపేసావ్.. ఓ మై గాడ్ ముంచేసావ్, ఐ ఫోన్ ఇచ్చి స్క్రీను లాకేసావ్.. వంటి పదాలు బాగున్నాయి.
యజిన్ నిజార్ చాలా చక్కగా పాడాడు. యూత్ చాలా త్వరగా కనెక్ట్ అవుతారీ సాంగ్‌కి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మార్చి 1న 118 రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : తమ్మిరాజు, మాటలు : మిర్చి కిరణ్, వి.శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్, అన్బరివు, రియల్ సతీష్, కథ, సినిమాటోగ్రఫీ అండ్ దర్శకత్వం : కె.వి.గుహన్
వాచ్ 118 లిరికల్ వీడియో…