Yevam Teaser : ‘యేవమ్’ టీజర్ రిలీజ్.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి..

యేవమ్ టీజర్ మీరు కూడా చూసేయండి..

Yevam Teaser : చాందిని చౌదరి వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతుంది. ఇటీవల గామి సినిమాతో హిట్ కొట్టిన చాందిని త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో రాబోతుంది. ఆ తర్వాత యేవమ్ అనే సినిమాతో రాబోతుంది. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యేవమ్. ఈ సినిమాలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Yakshini Trailer : ‘యక్షిణి’ ట్రైలర్ రిలీజ్.. వామ్మో మంచు లక్ష్మి, వేదిక భయపెట్టడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

తాజాగా యేవమ్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్ ని హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. యేవమ్ టీజర్ మీరు కూడా చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు