Chandini Chowdary Yevam Trailer Released
Yevam Trailar : తెలుగమ్మాయి చాందిని చౌదరి వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతుంది. చాందిని త్వరలో ఒకే రోజు మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలతో రాబోతుంది. ఈ రెండు సినిమాలు జూన్ 14న రిలీజ్ కాబోతున్నాయి. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో యేవమ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చాందిని పోలీసాఫీసర్ గా నటిస్తుంది.
Also Read : Pawan Kalyan : కొడుకు అకిరాను మోదీకి పరిచయం చేసిన పవన్ కల్యాణ్
ఇప్పటికే యేవమ్ నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా యేవమ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో చాందిని అదరగొట్టేసింది. ఒక అమ్మాయికి పోలీస్ ఉద్యోగం ఎందుకు అని అందరూ మాటలు అంటుంటే తను ఎలా నిలబడింది? వరుస హత్యలు జరుగుతుంటే ఆ కేసుని చాందిని ఎలా ఛేదించింది అనే అంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా యేవమ్ ట్రైలర్ చూసేయండి.